రోజువారీ వార్తలు

ప్రతికారం మొదలు పెట్టిన సైన్యం …పుల్వామా దాడి “మాస్టర్ మైండ్ ” ఖేల్ ఖతం

పుల్వామా ఉగ్రదాడి ప్రతీకారేచ్చకు సన్నద్దమైంది సైన్యం .ముష్కరుల దొంగ దెబ్బ కు సరైన సమాధానం చెప్పేందుకు రెడీ అయింది .ఆ క్రమం లో జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినా ఇద్హరిని మట్టుబెట్టింది .పుల్వామా ఉగ్రదాడిలో మాస్టర్ మైండ్ అయిన రషీద్ ఘాజితో పాటు మరో టెర్రరిస్ట్ కమ్రాన్ ను కాల్చి చంపింది ఇండియన్ ఆర్మీ సైన్యం .సోమవారం నాడు తెల్లవారు జామున పుల్వామా జిల్లాలోని పింగ్లాస్ ఏరియాలో జరిగిన ఎదురు కాల్పుల్లో టెర్రరిస్ట్ ల అంతం చూసింది .ఈ ఘటన మేజర్ తో మరో ముగ్గురు జవాన్లు నేలకొరిగారు .

pulwama army

అస్సలు ఎవడు ఈ ఘాజీ ?

పుల్వామా ఉగ్రదాడి లో 40 మంది పైగా జవాన్లను పొట్టన పెట్టుకుంది జైషి మహమ్మద్ ఉగ్రవాద సంస్థ .ఈ దాడి కి మాస్టర్ మైండ్ గ ఆ సంస్థ కమాండర్ అబ్దుల్ రషీద్ ఘాజి పై సైన్యం అనుమానాలు వ్యక్తం చేసింది .ఆత్మాహుతి దాడి కి దిగిన ఆదిల్ కి ఘాజియే శిక్షణ ఇచ్చాడనే ప్రచారం జరుగుతోంది .అంతే కాదు ఆ సంస్థ చీఫ్ మౌలానా ముసూద్ అజర్ కు ఘాజి ప్రధాన అనుచరుడిగా ముద్రపడ్డాడు .అయితే ఐఈడి బాంబులు ఉపయోగించటం లో విశిష్ట అనుభవమున్న ఘాజి …మొన్నటి పుల్వామా దాడి ఘటనలో ఆదిల్ కు శిక్షణ ఇచ్చాడు .గత రెందేలల్లో టెర్రరిస్ట్ లకు ,సైన్యానికి మధ్య జరిగన దాడుల్లో మసూద్ అజర్ జవాన్లను అంతమొందిచాడు .దీంతో ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న మసూద్ …ఘాజిని కాశ్మీర్ కు పంపించాడు .ఆ నేపధ్యంలోనే ఆదిల్ కు శిక్షణ ఇచ్చాడు ఘాజి .పుల్వామా ఉగ్రదాడి అనంతరం అక్కడికి సమీపం లో ని ఇళ్ళల్లో ఘాజి దాక్కున్నాడు .ఆ క్రమంలో ఉగ్రవాదులు ఓ ఇంట్లో ఉన్న సమాచారం మేరకు ..సోమవారం తెల్లవారుజామున భద్రతా దళాలు చుట్టుముట్టాయి .ఎదురుకాల్పులు జరగడం తో ఆర్మీ మేజర్ సహా నలుగురు సైనికులు చనిపోయారు .అనంతరం కొనసాగిన కాల్పుల్లో ఘాజితో పాటు కమ్రాన్ ను అంతమొందించింది సైన్యం .గతంలో పలుమార్లు జవాన్లు దాడి ఘాజి తప్పించుకున్నాడు .

 

కాశ్మీర్ లో పట్టు

2008 లో జైషి మహమ్మద్ సంస్థతో జత కట్టిన ఘాజి ..ఆ సంస్థ చీఫ్ మౌలానా ముసూద్ అజర్ కు సన్నిహితుడుగా మరెంతల ఎదిగాడు .ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల దగ్గర దాదాపు రెండేళ్ళ పాటు శిక్షణ పొందాడు .అనంతరం 2010 లో వజరిస్తాన్ లో అడ్డ వేసి ..ఆ సంస్థ కోసం కాశ్మీర్ యువకులను రిక్రూట్ చేసే వాడు .అలా నియమించుకున్న వారిలో ఆదిల్ కుడా ఒక్కడు .కోతగా చేరిన వారికి శిక్షణ ఇస్తూనే ..కాశ్మీర్ పై పూర్తీ పట్టు సాదించాడు .అలా మొన్నటి పుల్వామా ఉగ్రదాడి 40 మందికి పైగా జవాన్లను పోట్టనపెట్టుకున్నాడు .

pulwama kashmir army attack

 

ఆ రోజే హతమై ఉంటె ..!

జైషి సంస్థ కాశ్మీర్ లో రెచ్చిపోవడానికి ప్రధాన కారణం ఘాజియే అనే విషయం స్పష్టమవుతుంది .ఘాజి కార్యకలాపాలు విస్తరించటం తో జైషి సంస్థ కొంత పట్టు సాదించినట్లు అయింది .రూరల్ లెవెల్లో నియామకాలు చేపెట్టిన ఘాజి ..ఆ మేరకు ఎప్పటికప్పుడు pakka వ్యూహాలు రచించేవాడట.యువకులను చేర్చుకునే క్రమంగా మార్చాడు .ఘాజీ కదలికలను పసిగట్టిన సైన్యం పలుమార్లు నిలువరించే ప్రయత్నం చేశాయి .కాని చాలా సార్లు తప్పించుకున్నాడు .ఆ క్రమంలో కొద్ది రోజుల కిందట కుడా జరిగిన ఎదురుకాల్పుల్లో సైన్యానికి తారసపడి త్రుటి లో తప్పించుకున్నాడు .అప్పుడే ఘాజి అంతమొంది ఉంటె ..భారత సైన్యం 40 మందికి పైగా జవాన్లను కోల్పోయి ఉండేది కాదు .

Tags

Rajak

Hey! I am RajakVali the creator of TeluguTechWorld, a very popular YouTube channel in which I talk about tech in telugu. TeluguMala.com is my attempt to showcase the latest trends happening in the world to you in our own telugu language.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close